ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఐలమ్మ జీవితం నేటి తరం కు ఆదర్శం.


 

మార్కెట్ కమిటి చైర్మన్ వెన్నపూసల సీతారాములు.


ప్రజాపక్షం / నేలకొండపల్లి:  తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జీవితం నేటి తరం కు ఆదర్శమని నేలకొండ


పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ వెన్నపూసల సీతారాములు కొనియాడారు. మండల కేంద్రంలో శనివారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం ను నిర్వహించారు. ఆమె విగ్రహాం కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. ఐలమ్మ పోరాట స్పూర్తితో ముందుకు సాగాలని సూచించారు. ఐలమ్మ గుర్తిస్తూ ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మారిశెట్టి వేంకటేశ్వరరావు, వివిధ పార్టీలు, బీసీ సంఘాల ప్రతినిధులు కాసాని నాగేశ్వరరావు, బచ్చలకూరి నాగరాజు, మేకల వెంకటేశ్వర్లు, పాగర్తి సుధాకర్, జెర్రిపోతుల అంజని, కట్టెకోల నాగార్జున, కడియాల నరేష్, సూరేపల్లి జ్ఞానరత్నం, గరిడేపల్లి రామారావు, మల్లెబోయిన గోవిందరావు, పగిడికత్తుల నాగేశ్వరరావు కొండా హర్షవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم