ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

విజయవంతంగా ముగిసిన ఖమ్మం అర్బన్ మండల క్రీడోత్సవాలు


 మూడు రోజుల పాటు ఉత్సాహంగా పోటీలు.. పాల్గొన్న 1,712 మంది విద్యార్థులు

ప్రజాపక్షం/ఖమ్మం: ఖమ్మం అర్బన్ మండలం నార్త్ లెవెల్ క్రీడోత్సవాలు మూడు రోజుల పాటు న్యూ విజన్ పాఠశాల క్రీడా మైదానంలో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించి విజయవంతంగా ముగిశాయి. ప్రభుత్వ, ప్రైవేట్, రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన అండర్-14, అండర్-17 బాలబాలికలు కలిపి మొత్తం 1,712 మంది విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఏఎంఓ పెసర ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి యాస రామారావు, న్యూ విజన్ స్కూల్ డైరెక్టర్లు కార్తీక్, స్ఫూర్తి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏఎంఓ పెసర ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. క్రీడల ద్వారా విద్యార్థుల్లో స్పోర్టివ్ స్పిరిట్‌తో పాటు మానసిక, శారీరక ఆరోగ్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. మండల స్థాయిలో చూపిన ప్రతిభను కొనసాగిస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించాలని ఆకాంక్షించారు.

కబడ్డీ విజేతలు...

అండర్-17 బాలుర విభాగం: విజేత – జీహెచ్‌ఎస్ ఎన్ఎస్‌సీ కాలనీ, రన్నరప్ – గోర్కె పబ్లిక్ స్కూల్. అండర్-14 బాలికల విభాగం: విజేత – టీజీఎస్‌డబ్ల్యూఆర్ఎస్ టేకులపల్లి, రన్నరప్ – ఇగ్నైట్ స్కూల్. అండర్-17 బాలికల విభాగం: విజేత – జీహెచ్‌ఎస్ ఎన్ఎస్‌సీ కాలనీ, రన్నరప్ – డైట్ ఖమ్మం.

వాలీబాల్ విజేతలు...

అండర్-14 బాలుర విభాగం: విజేత – శ్రీ విద్యానికేతన్, రన్నరప్ – న్యూ విజన్ స్కూల్. అండర్-17 బాలుర విభాగం: విజేత – జీహెచ్‌ఎస్ నాయాబజార్, రన్నరప్ – బ్లూమింగ్ మైండ్ స్కూల్. అండర్-17 బాలికల విభాగం: విజేత – బ్లూమింగ్ మైండ్ స్కూల్, రన్నరప్ – టీజీఎస్‌డబ్ల్యూఆర్ఎస్ టేకులపల్లి. అండర్-14 బాలికల విభాగం: విజేత – బ్లూమింగ్ మైండ్ స్కూల్, రన్నరప్ – గోర్కె స్కూల్.


ఖో-ఖోలోనూ ప్రతిభ...


అండర్-14 బాలుర విభాగం: విజేత – బ్లూమింగ్ మైండ్, రన్నరప్ – శ్రీ విద్యానికేతన్. అండర్-14 బాలికల విభాగం: విజేత – బ్లూమింగ్ మైండ్, రన్నరప్ – పాండురంగాపురం. అండర్-17 బాలుర విభాగం: విజేతలు – బ్లూమింగ్ మైండ్, ఎస్‌ఎఫ్‌ఎస్. అండర్-17 బాలికల విభాగం: విజేత – బ్లూమింగ్ మైండ్, రన్నరప్ – జడ్పీహెచ్‌ఎస్ పాండురంగాపురం.

క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బ్లూమింగ్ మైండ్ స్కూల్ ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది.

క్రీడోత్సవాల నిర్వహణలో మండల కమిటీ సభ్యులు నాగుల్ మీరా, రాము నాగప్రసాద్, రోజా, సంపత్‌కుమార్, విజయకుమారి, పీడీలు, పీఈటీలు, నేషనల్ రిఫరీలు నాగేశ్వరరావు, నరసయ్య, సత్యనారాయణ తదితరులు కీలకంగా వ్యవహరించారు. ఆర్గనైజింగ్ పీడీలు సంపత్‌కుమార్, వెంకటేశ్వర్లు, శంకర్, తులసితో పాటు ప్రైవేట్ పాఠశాలల పీఈటీలు, పీడీలు అందించిన సహకారంతో క్రీడోత్సవాలు విజయవంతంగా ముగిశాయని ఎస్‌జీఎఫ్ మండల కార్యదర్శి బి.కృష్ణయ్య, కన్వీనర్ అబద్ అలీ తెలిపారు. క్రీడోత్సవాలను విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది