గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం
సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ దంపతులకు ఘన సన్మానం
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డు శ్రీ సాయి బృందావన్ నగర్లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. నూతలపాటి శ్రీనివాస్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని 30వ వార్డు సీపీఐ కౌన్సిలర్ దండి శ్రీజ ప్రారంభించారు. అనంతరం గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గుణగంటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సురభి సాయికృష్ణ ఆధ్వర్యంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, ఆయన సతీమణిని ఘనంగా సత్కరించారు. వారికి శాలువా కప్పి మెమొంటో అందజేశారు. అలాగే కౌన్సిలర్ దండి శ్రీజ, లోకేష్ దంపతులకు కాంగ్రెస్ నాయకుడు భూక్య సురేష్ నాయక్ మెమొంటో అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంతో శ్రీ సాయి బృందావన్ నగర్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కాలనీవాసులతో పాటు చుట్టుపక్కల కాలనీ
లకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అన్నదానం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు గణపరపు వీరన్న, కాలనీ సభ్యులు ఆంగోతు శ్రీనివాసరావు, మాజీ కమిటీ అధ్యక్షుడు జంపాల కిరణ్, తిగుల శ్రీనివాసరావు, సామినపల్లి శ్రీనివాస్ చారి, సాంబశివరావు, గూగుల్ చంద్రశేఖర్, శ్రీహరి ,ఇషాక్, దిలీప్, లాలయ్య, సప్న, స్వామి, నలబోలు వెంకటరెడ్డి, సంధ్య, మణి తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి