డివైడర్‌ను ఢీకొన్న కారు.. క్షణాల్లో చెలరేగిన మంటలు
ఖమ్మం మమత ఆసుపత్రి వైద్యుడు కాసు కుర్తి జగదీష్ గా గుర్తింపు
ప్రజాపక్షం/ఖమ్మం: ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొని మంటల్లో చిక్కుకోవడంతో మమత ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ కసాకుర్తి జగదీష్ కారులోనే సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన పిల్లలమర్రి వద్ద చోటుచేసుకుంది.డాక్టర్ జగదీష్ ఖమ్మం నుంచి కారులో హైదరాబాద్ వైపు బయలుదేరారు. పిల్లలమర్రి సమీపానికి చేరుకోగానే కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే కారులో మంటలు చెలరేగినట్లు సమాచారం. చూస్తుండగానే మంటలు కారంతటినీ చుట్టుముట్టడంతో అందులో ఉన్న డాక్టర్ జగదీష్ బయటకు రాలేకపోయారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే కారులో ఉన్న డాక్టర్ జగదీష్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఖమ్మం వైద్య వర్గాల్లో విషాదం నెలకొంది. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి