ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

కోదాడ మెగా జాబ్ మేళాలో నిధి ఐటీ సొల్యూషన్స్



 ప్రజాపక్షం/ ఖమ్మం: కోదాడ పట్టణంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఖమ్మంకు చెందిన నిధి ఐటీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పాల్గొంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మెగా జాబ్ మేళాకు యువత నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఉత్తమ్ పద్మావతి నిధి ఐటీ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించి, సంస్థ ప్రతినిధులను అభినందించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే వేదికను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతికి నిధి ఐటీ ఫౌండర్, చైర్మన్ రామోజీ ఉప్పలచారి కృతజ్ఞతలు తెలిపారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా ఇటువంటి జాబ్ మేళాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిధి ఐటీ మేనేజ్‌మెంట్ అండ్ డైరెక్టర్ గారిడేపల్లి సాయికిరణ్, హెచ్‌ఆర్ ప్రతినిధులు మస్రత్, వినయ్, అర్చన, మురళి, శ్రీకాంత్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది