ప్రజా పక్షం/వైరా: ప్రతి మనిషి సేవాభావాన్ని పెంపొందించుకొని సమాజ సేవకు పాటుపడాలని లయన్స్ క్లబ్ ఫస్ట్ జిల్లా గవర్నర్ డాక్టర్ కాపా మురళీ
కృష్ణ అన్నారు. వైరా గ్రేట్ విజన్ క్లబ్, లయన్స్ క్లబ్ ఆఫ్ అవని సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా జీఈటీ కోఆర్డినేటర్ ఉండ్రు శ్యాంబాబు–వరలక్ష్మి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా గురువారం వైరా మున్సిపాలిటీ 20వ వార్డులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటు రమ అనే విద్యార్థినికి సైకిల్‌ను అందజేశారు. అనంతరం వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి శ్యాంబాబు–వరలక్ష్మి దంపతులకు క్లబ్ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ కాపా మురళీకృష్ణ మాట్లాడుతూ.. ప్రతి లయన్ మెంబర్ తన సంపాదనలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయించాలని సూచించారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలోని అవసరమైన వారికి అండగా నిలవడం అభినందనీయమన్నారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన శ్యాంబాబు–వరలక్ష్మి దంపతులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎల్‌సీఐఎఫ్ కోఆర్డినేటర్ లగడపాటి ప్రభాకర్‌రావు, జోన్ చైర్మన్ తోటకూర శ్రీకాంత్, జిల్లా క్యాబినెట్ జాయింట్ ట్రెజరర్ పెనుగొండ ఉపేందర్‌రావు, రీజియన్ సెక్రటరీ వై. బుచ్చిరామారావు, గ్రేట్ విజన్ క్లబ్ అధ్యక్షుడు ఉయ్యూరు రామకృష్ణ, కార్యదర్శి మచ్చా రామారావు, అవని క్లబ్ అధ్యక్షురాలు గద్దె నీరజ, కార్యదర్శి సుగ్గల మాధవి, సభ్యులు పోలా శ్రీనివాసరావు, నాళ్ల నాగమల్లేశ్వరి, రాయల విజయలక్ష్మి, పొదిలి కల్పన, సునీత, శైలజ, పువ్వాళ రాము, బిఖ్య తదితరులు, క్లబ్ సభ్యులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.ప్రతి మనిషి సేవాభావాన్ని పెంపొందించుకోవాలి:డాక్టర్ కాపా మురళీకృష్ణ
byThe News Desk
-
0

కామెంట్‌ను పోస్ట్ చేయండి