ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించాలి

 

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, షూస్ పంపిణీ

ప్రజా పక్షం/వైరా: వైరా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా జీఈటీ కోఆర్డినేటర్ ఉండ్రు శ్యాంబాబు–వరలక్ష్మి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా గురువారం 20వ వార్డులోని శాంతినగర్ ఎస్టీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ పుస్తకాలు, షూస్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కేక్ కట్ చేయించి, శ్యాంబాబు–వరలక్ష్మి దంపతులకు లయన్స్ క్లబ్ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.లయన్స్ క్లబ్ ఫస్ట్ జిల్లా గవర్నర్ డాక్టర్ కాపా మురళీకృష్ణ మాట్లాడుతూ.. ప్రతి లయన్ మెంబర్ తమ పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం వంటి ప్రత్యేక సందర్భాలను సేవా కార్యక్రమాలతో నిర్వహించాలని సూచించారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు పుస్తకాలు, షూస్ అందజేసిన శ్యాంబాబు–వరలక్ష్మి దంపతులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎల్‌సీఐఎఫ్ కోఆర్డినేటర్ లగడపాటి ప్రభాకర్‌రావు, రీజన్ చైర్మన్ నూకల శ్రీనివాసరావు, జిల్లా క్యాబినెట్ జాయింట్ ట్రెజరర్ పెనుగొండ ఉపేందర్‌రావు, జోన్ చైర్మన్ తోటకూర శ్రీకాంత్, రీజియన్ సెక్రటరీ వై. బుచ్చిరామారావు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కొల్లా రాంబాబు, కార్యదర్శి కొదుమూరి రవి, వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి శ్రీనివాసరావు, సభ్యులు మరికంటి రాంగోపాల్ దాస్, సంగిశెట్టి వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణారెడ్డి, ఉపాధ్యాయురాలు కరుణశ్రీ, బిఖ్య సేవాలాల్ అధ్యక్షుడు నరసింహ నాయక్, జిల్లా కమిటీ సభ్యులు నూకల ప్రసాదరావు, చింతోజు నాగేశ్వరరావు, చింతలపూడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది