ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా చింతల రమేష్


 యాదగిరిగుట్టలో జరిగిన రాష్ట్ర 3వ మహాసభల్లో ఏకగ్రీవ ఎన్నిక

మహాసభల్లో ఆమోదించిన తీర్మానాల అమలుకు యువజన ఉద్యమాలను బలోపేతం చేస్తాం

ప్రజాపక్షం/రఘునాథపాలెం : అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఖమ్మం జిల్లా కార్యదర్శి, రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామానికి చెందిన చింతల రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో నిర్వహించిన ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభల్లో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా మర్రి శ్రీమాన్, నేర్లకంటి శ్రీకాంత్ ఎన్నిక కాగా, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా చింతల రమేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చింతల రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర 3వ మహాసభల్లో విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై పలు తీర్మానాలను ఆమోదించి, భవిష్యత్ పోరాటాలకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు పరిశ్రమను నిర్మించాలని, ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రానైట్, వ్యవసాయ ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించి, కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని మహాసభలో తీర్మానాలు చేసినట్లు పేర్కొన్నారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభలు, యువజన మహా ప్రదర్శన, బహిరంగ సభలు ఉత్సాహపూరిత వాతావరణంలో విజయవంతంగా జరిగాయని రమేష్ తెలిపారు. మహాసభల స్ఫూర్తితో ఆమోదించిన తీర్మానాల అమలుకు కృషి చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా యువజన ఉద్యమాలను మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ పోరాటాలను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم