ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఘనంగా కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన సంబరాలు



 ఖమ్మం డీసీసీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ

ప్రజాపక్షం/ఖమ్మం: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా సంబరాలు నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇన్‌చార్జ్ గ్రంధి ప్రవీణ్, వైరా నియోజకవర్గ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇన్‌చార్జ్ ఆత్మకూరి శేషగిరిరావు ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులుగా పాలన సాగిస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు పరస్పరం మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم