ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

తల్లంపాడులో విరిసిన ఆధ్యాత్మిక శోభ


 మిర్చి యూత్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం

ప్రారంభించి భక్తులకు స్వయంగా అన్నం వడ్డించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: భక్తి, సేవాభావం కలగలిసిన వాతావరణంలో తల్లంపాడు గ్రామంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. మిర్చి యూత్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని సన్నిధిలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, మహా అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో మంగళవారం ఘనంగా సాగింది. కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అన్నదానాన్ని ప్రారంభించడంతో పాటు భక్తులకు స్వయంగా అన్నం వడ్డించారు. తొలుత వినాయకుని వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాలువాలతో ఘనంగా సత్కరించారు.  మిర్చి యూత్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించడం పట్ల మంత్రి ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంబేద్కర్, మిర్చి యూత్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది