ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంలోని కామంచికల్లు గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని బుధవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ చరిత్రలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోషించిన వీరోచిత పాత్రను పలువురు గౌడ సంఘం నాయకులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అమరుగాని వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షులు బోడపట్ల వెంకన్న, డాక్టర్ రాజశేఖర్ గౌడ్ , బుడుగు శ్రీనివాస్ గౌడ్ పోతగాని కృష్ణారావు బండి నాగేష్ , గండి రవి, అంతుల లక్ష్మీనారాయణ , గౌడ సంఘం పెద్దలు గడిపల్లి ఉపేందర్ పల్లె నరసింహారావు, వ్యాసారపు రాములు బోయినపల్లి శ్రీను మొక్క మల్లయ్య, 150 మంది గౌడ సభ్యులు పాల్గొన్నారు.
ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ
byThe News Desk
-
0

కామెంట్‌ను పోస్ట్ చేయండి