ఖమ్మం కలెక్టర్‌కు జిల్లా పీఏసీఎస్ చైర్మన్ల వినతి
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)కు నామినేషన్ పద్ధతిలో కాకుండా సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఖమ్మం జిల్లా పీఏసీఎస్ చైర్మన్లు శనివారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పీఏసీఎస్ సంఘాలకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి, చైర్మన్లు, పాలకవర్గాలను ఎన్నుకునేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, తమ విజ్ఞప్తిని ప్రభుత్వానికి అందించాలని కలెక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పీఏసీఎస్‌ల చైర్మన్లు కలిసి వినతిపత్రం సమర్పించారు.

إرسال تعليق