ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

దళిత స్పీకర్‌పై వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం: ఆరెంపుల బద్రిసాయి


 

తాతా మధు వ్యాఖ్యలు ఖండన

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : దళిత స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చేసిన వ్యాఖ్యలను దళిత సమాజం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీం పొంగులేటి పీఎస్ఆర్ సోషల్ మీడియా వారియర్ ఆరెంపుల బద్రిసాయి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో దళితులు గణనీయమైన శాతం ఉన్నారని, దళిత సమాజాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదని అన్నారు. దళిత ప్రజాప్రతినిధుల ఓట్లతో ఎమ్మెల్సీగా ఎన్నికైన తాతా మధు అదే సమాజాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. దళిత స్పీకర్‌ను అసభ్య పదజాలంతో దూషించడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమని పేర్కొన్నారు. దళిత నాయకుడిని, దళిత సమాజాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ రాజకీయ సంస్కృతిలో భాగమా అని ప్రశ్నించారు. ఇటువంటి వ్యాఖ్యలు దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయని అన్నారు. తాతా మధు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో తీవ్ర ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వ్యాఖ్యలపై పోలీసులు కూడా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది