వినాయకుని సన్నిధిలో భక్తిశ్రద్ధలతో సాగిన కార్యక్రమం
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: వినాయకుడి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంతో పల్లెగూడెం గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శ్రీ బాల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నాయకులు లింగా వెంకటనారాయణ, చుండూరు కృష్ణయ్య ముఖ్య అతిథులుగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, ముఖ్య అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానిక ప్రజలు అన్నదాన కార్యక్రమానికి హాజరై స్వామివారి ప్రసాదంగా అన్నదానాన్ని స్వీకరించారు. గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో లింగ శ్రీనివాసరావు, మునగాల లాలు బాబు, దేవరకొండ సుధాకర్, బజరంగ్ యూత్ కమిటీ సభ్యులు, కళ్లెం నాగభూషణం, కళ్యాణ్, బాలకృష్ణ, కళ్లెం భాస్కర్, కళ్లెం నాగార్జున, తిరుపతిరావు, ధర్మ, రాము, మోతే పుల్లయ్య, కళ్లెం మదర్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి