ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలి


కలెక్టర్‌కు పాలేరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ ప్రతినిధుల వినతి

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పాలేరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధి బృందం సోమవారం ఖమ్మం జిల్లా కలెక్టర్‌ దివాకర టీఎస్నును కలెక్టరేట్లో కలిసి వినతిపత్రం అందజేసింది. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజలకు పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రతినిధులు కోరారు. హామీల అమలులో జాప్యం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, నాయకులు పేరా వెంకటేశ్వర్లు, జరుపుల లక్ష్మణ్ నాయక్, ముత్యం కృష్ణారావు, మెదరమెట్ల శ్రీనివాసరావు, గుడి బోయిన దర్గయ్య, సంజీవరెడ్డి, నల్లపునేని భాస్కరరావు, అక్కినపల్లి వెంకన్న, బానోతు కృష్ణ, చుంచు నారాయణ, వెంపటి ఉపేందర్, మైబలి, కర్లపూడి రవి తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم