ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఘనంగా డాక్టర్ బొర్రా సుధాకర్ జన్మదిన వేడుకలు


 

రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ.. వృద్ధాశ్రమంలో కేక్‌ కటింగ్

ప్రజాపక్షం /వైరా: తెలంగాణ రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ వైస్‌ చైర్మన్ బొర్రా రాజశేఖర్ సోదరుడు, డాక్టర్ బొర్రా సుధాకర్ జన్మదిన వేడుకలను బుధవారం వైరాలో ఘనంగా నిర్వహించారు. ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.వైరా వైద్య పరిషత్ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం వైరా మండలం గొల్లపూడిలోని వృద్ధాశ్రమంలో వృద్ధుల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. వైరాలోని పలు ప్రాంతాల్లోనూ డాక్టర్ బొర్రా సుధాకర్ అభిమానులు, అనుచరులు వేడుకలు జరిపారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ డాక్టర్ బొర్రా సుధాకర్ నిత్యం ప్రజా జీవితంలో ఉంటూ ఆపదలో ఉన్న వారికి ‘నేనున్నాను’ అంటూ అండగా నిలుస్తున్నారని అన్నారు. ఎంతోమంది విద్యార్థులకు సహకారం అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా అండగా నిలిచి భరోసా కల్పించే సుధాకర్ మరిన్ని ఉద్యోగ రీతిలో మరెన్నో ఉన్నత పదోన్నతులు అధిరోహించాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజల మధ్య సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో ధార్నా రాజశేఖర్, నాల్ల రమేష్, ఊరుకొండ శ్రీను, మందా వెంకన్న, పర్స రామకృష్ణ, గరిడేపల్లి కిషోర్, రాచకొండ సాయి, వేముల శ్రీనాథ్, మోండ్రు బాలరాజు, ఉదారపు ప్రసాద్, వేముల గోపి, వల్లెపు మహేష్, వేముల నర్సింహారావు, శేఖర్, బండారు వంశీ, వల్లెపు మరియదాసు, తోట ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم