ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఆరంపుల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్ మృతి


 ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ :  మండలంలోని ఆరంపుల గ్రామ శివారులోని గ్రానైట్ పరిశ్రమల సమీపంలో ఖమ్మం–వరంగల్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఆగి ఉన్న లారీ డ్రైవర్ వాహనం గాలి పరిశీలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది