ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

వైరా KVKలో మంచినీటి చేపల వ్యాధులపై అవగాహన


 

ప్రజాపక్షం /వైరా: జాతీయ జలచర జంతు వ్యాధుల పర్యవేక్షణ కార్యక్రమం (NSPAAD దశ–II)లో భాగంగా మంచినీటి చేపల వ్యాధులపై చేపల రైతులకు అవగాహన కల్పించేందుకు వైరాలోని కృషి విజ్ఞాన్ కేంద్రం (KVK)లో గురువారం ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్తలు, అధిపతులు డా. శ్యామ్ ప్రసాద్, డా. పావని, శ్రీ షిగా నాగరాజు, కుమారి బనోతా దివ్య, శ్రీ చల్లా నరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేపల రైతులకు మంచినీటి చేపల వ్యాధులు, నీటి నాణ్యత నిర్వహణ, బయోసెక్యూరిటీ, వ్యాధుల నివారణ–నియంత్రణ, వ్యాధి లక్షణాలను ప్రారంభ దశలో గుర్తించడం, చేపల ఆరోగ్య నిర్వహణ తదితర అంశాలపై శాస్త్రీయ అవగాహన కల్పించారు. చేపల పెంపకంలో నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించడం, బయోసెక్యూరిటీ చర్యలను పాటించడం, వ్యాధుల ప్రారంభ లక్షణాలను గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకోవడం ద్వారా నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చని వివరించారు. చేపల వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలే కీలకమని, శాస్త్రీయ పద్ధతులను పాటించడం ద్వారా చేపల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఆక్వాకల్చర్‌లో ఉత్పాదకతను పెంచుకోవచ్చని కార్యక్రమంలో సూచించారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా చేపల రైతులకు వ్యాధుల గుర్తింపు, నివారణ, నియంత్రణపై ప్రాయోగిక మార్గదర్శకాలు అందించడంతో పాటు ఆరోగ్యకరమైన చేపల పెంపకం, మెరుగైన దిగుబడుల సాధనకు శాస్త్రీయ విధానాల ప్రాధాన్యతను వివరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది