ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

మెనూ అమలు చేస్తున్నారా...! కంటికి రెప్పలా చూసుకోవాలి


 

ప్రజాపక్షం/నేలకొండపల్లి: ప్రభుత్వ వసతి గృహాంలో విద్యార్థులకు మెనూ ను ఖచ్చితంగా అమలు చేయాలని నేలకొండపల్లి తహశీల్దార్ పి.రాంప్రసాద్ ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ వసతి గృహాం ను గురువారం రాత్రి ఆకస్మికంగా తనీఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. వంట గదులకు వెళ్లి నిత్యవసర సరుకులను, వంటలను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించారు. మెనూ బోర్డు ను పరిశీలించి..రోజు వారీగా మెనూ 'ను అందిస్తున్నారా అని విద్యార్థినులను అడిగి . తెలుసుకున్నారు. వారి విద్యా ప్రగతి ని పరిశీలించారు. వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు... విద్యార్థులువసతి గృహాం లో ఉన్నప్పటికీ ఇంటి వద్ద ఉన్న ఫీలింగ్ కలిగేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. వారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత వసతి గృహాం అధికారులు, సిబ్బంది పై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవిన్యూ ఇన్సెపెక్టర్ ఆలస్యం మధుసూధన్ రావు ఉన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది