ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

వైరా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య శిబిరం ప్రారంభం


 

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ

ప్రజాపక్షం / వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఆరోగ్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్ బత్తినేని హర్ష, మార్కెట్ కమిటీ చైర్మన్ బొల్లా గంగారావు, మండల అధ్యక్షులు శీలం చంద్రశేఖర్ రెడ్డి, పొదిల హరినాథ్, కొల్లి రమేష్, మిట్టపల్లి శ్రీనివాసరావు, ఆనందరావు, బీక్యా తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది హాజరయ్యారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది