సామినేని రామారావు హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులకు అభినందనలు
ప్రజాపక్షం / వైరా: సామినేని రామారావు హత్య కేసులో పోలీసుల దర్యాప్తును కాంగ్రెస్ నాయకులు అభినందించారు. హత్య రాజకీయాల సంస్కృతి ఎవరిదో ప్రజలకు తెలుసని కాంగ్రెస్ వైరా మండల అధ్యక్షుడు శీలం చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దాసరి దానియేలు, మార్కెట్ కమిటీ చైర్మన్ బొల్లా గంగారావు, ఆత్మ కమిటీ చైర్మన్ మట్టూరి వెంకటేశ్వరరావు, జిల్లా డాక్టర్ సెల్ అధ్యక్షుడు కాపా మురళి అన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై సీపీఎం నాయకులు చేస్తున్న ఆరోపణలు తప్పు అని వారు ఖండించారు. రామారావు హత్య వెనుక ఆర్థికపరమైన వ్యవహారాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోందని, పోలీసులు ఇప్పటికే కొంతమందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారని తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున వాస్తవాలు వెలుగులోకి రావడానికి అందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. రామారావు హంతకులకు తగిన శిక్ష పడేలా, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మచ్చ వెంకటేశ్వరరావు (బుజ్జి), సర్పంచులు నూతి వెంకటేశ్వరరావు, జవాజి అశ్విని, తడికమల్ల నాగార్జున, భూక్య బాలాజీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, మిట్టపల్లి సతీష్, పొదిల హరినాథ్, ఎస్.కె. సైదా, నర్వనేని అశోక్, ఉండ్రు శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి