ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

“ఎదులాపురం అభివృద్ధికి రూ.150 కోట్ల భారీ ప్రణాళిక!”



 


మూడు డివిజన్లలో ఇప్పటికే రూ.79 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం


46 సిమెంట్ రోడ్ల నిర్మాణానికి రూ.5 కోట్లతో శంకుస్థాపన


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి రాబోయే రోజుల్లో మరో రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు నిధులు తీసుకొచ్చి ప్రతి డొంకను, ప్రతి రహదారిని సిమెంట్ రోడ్డుగా మారుస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. అలాగే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీలోని మూడు డివిజన్ల పరిధిలో ఇప్పటికే రూ.79.79 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. శుక్రవారం యెదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో  సుమారు రూ.5 కోట్ల వ్యయంతో 46 అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే రోల్‌మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులకు నిధులు సమకూరుస్తున్నామన్నారు. ఈ మున్సిపాలిటీ విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతోపాటు గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పాటు పలు గ్రామపంచాయతీలు విలీనం కావడంతో అనేక ప్రాంతాల్లో అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయని వివరించారు. అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి చేపట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సాయిప్రభాత్‌నగర్ 1, 2, టెంపుల్ సిటీ, అభయ టౌన్‌షిప్, సింగరేణి కాలనీ, గుర్రాలపాడు తండా, ఇందిరమ్మ కాలనీ, కోట నారాయణపురం, సూర్యానగర్, చంద్రనగర్, చిన్నతండా, కెల్లార్‌నగర్, బృందావనం, గోకుల కృష్ణనగర్, తాళ్ళేసి తండా, లక్ష్మీ గాయత్రీనగర్, నందనవనం, ఏదులాపురం, ఆదిత్య టౌన్‌షిప్, ఆర్టీసీ కాలనీ, శ్రీవారి నగర్, సత్యసంకల్ప కాలనీ తదితర ప్రాంతాల ప్రజలకు అవసరమైన కీలక రహదారులను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు .కేవలం రహదారుల నిర్మాణమే కాకుండా తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా అవసరమైన విద్యుత్ లైన్ల విస్తరణ పనులు కూడా చేపట్టినట్లు వెల్లడించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగినప్పుడే రోల్‌మోడల్ మున్సిపాలిటీ లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు.అభివృద్ధితోపాటు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. అర్హులైన పేదలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా అడుగుల సైతం పడ్డాయి అన్నారు. మీ దీవెనలతో వచ్చిన ఈ మంచి ప్రజా ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేయడమే తప్ప గత ప్రభుత్వం ల తప్పులు చేయడం రాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి,  కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది