ప్రజాపక్షం/ఖమ్మం: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో వరుసగా రెండు రోజులు పర్యటిస్తారు. సోమవారం సాయంత్రం 4:30 గంటలకు కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో.. కూసుమంచి మండల లబ్ధిదారులకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5:45 గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని.. 22వ వార్డు టీఎన్జీవోస్ కాలనీలో గిరిజన సంక్షేమ శాఖ బాలుర పోస్ట్ మెట్రిక్ హాస్టల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. *మంగళవారం ఉదయం 9:30 గంటల నుంచి..* ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం దేవస్థానంలో, ఆ తర్వాత తక్కెళ్ళపాడు గ్రామంలోని శ్రీ లలితా రాజరాజేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని జేకే కాలనీలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం.. మినీ స్టేడియాన్ని, గోవింద్ సెంటర్ లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు తిలక్ నగర్ లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలకు హాజరవుతారు. ఇల్లెందు మండలం మేడికుంట వద్ద హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు ఫారెస్ట్ గ్రౌండ్ లో నిర్వహించే దసరా ఉత్సవాలకు హాజరవుతారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఉభయ జిల్లాల్లో 2 రోజులు మంత్రి పొంగులేటి పర్యటన
byThe News Desk
-
0

కామెంట్‌ను పోస్ట్ చేయండి