ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

సాగర్ కాలువలో ఉపాధ్యాయుడు గల్లంతు


 


ప్రజాపక్షం / పెనుబల్లి: నాగార్జునసాగర్ కాలువలో హిందీ ఉపాధ్యాయుడు గల్లంతైన ఘటన పెనుబల్లి మండలంలో ఆదివారం కలకలం రేపింది.  కొత్త కారాయిగూడెం గ్రామానికి చెందిన దొడ్డపనేని వెంకటేశ్వరరావు సాగర్ కాలువలో గల్లంతైనట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న వీఎం బంజర్ ఎస్సై షాకీర్ తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానికులు, గజ ఈతగాళ్ల సహకారంతో గల్లంతైన ఉపాధ్యాయుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది