ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన సీపీఐ జిల్లా సమితి సమావేశంలో ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడెంకు చెందిన బూర మనోజ్ జిల్లా సమితి సభ్యుడిగా ఎన్నికయ్యారు. 21 ఏళ్ల వయసులోనే ఈ బాధ్యత దక్కడం పట్ల ఆయన పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలపై పోరాటాలు నిర్వహిస్తానని మనోజ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో జిల్లా సమితి సభ్యుడిగా ఎన్నుకున్న జిల్లా పార్టీ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం మనోజ్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
21 ఏళ్లకే సీపీఐ జిల్లా సమితిలో బూర మనోజ్‌కు చోటు
byThe News Desk
-
0

కామెంట్‌ను పోస్ట్ చేయండి