ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

గుండు వెంకట్‌కు ‘భారత్ కళా పురస్కార్–2026’


 

బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్‌గా పురస్కారం


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ గోళ్లపాడు గ్రామానికి చెందిన ఫోటోగ్రఫీ రంగంలో తనదైన శైలితో రాణిస్తున్న ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుండు వెంకట్ (సినిమాటిక్ కు ప్రతిష్టాత్మక ‘భారత్ కళా పురస్కార్–2026’ లభించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక అవార్డు కార్యక్రమంలో బెస్ట్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ విభాగంలో నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించి పురస్కారం అందజేశారు. వివాహ వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోని అపురూపమైన క్షణాలను అత్యుత్తమ నాణ్యతతో తన కెమెరాలో బంధిస్తూ గుండు వెంకట్ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో నూతన ఒరవడిని తీసుకువస్తున్నందుకు ఆయన సేవలను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా గుండు వెంకట్ మాట్లాడుతూ.. తన ప్రతిభను గుర్తించి అవార్డు అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో మరింత నాణ్యమైన ఫోటోగ్రఫీ సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. గుండు వెంకట్‌కు పురస్కారం లభించడంపై కుటుంబ సభ్యులు, ఫోటోగ్రఫీ రంగానికి చెందిన మిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది