మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ
ప్రజాపక్షం/వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలు ఉత్సాహంగా పాల్గొని పండుగ సంబరాలను జరుపుకున్నారు.ఈ వేడుకల్లో వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ పాల్గొని మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగ మహిళల్లో ఆనందోత్సాహాలను నింపుతుందని, మన పూర్వీకుల నుంచి వారసత్వంగా అందిన సంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.బతుకమ్మ వేడుకలతో 6వ వార్డులో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు ఉత్సాహంగా పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి