ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

13వ వార్డులో ఘనంగా బతుకమ్మ వేడుకలు



 



మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్ ముళ్ళపాటి విజయ సీతారాములు


ప్రజాపక్షం/వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. ఈ వేడుకల్లో 13వ వార్డు కౌన్సిలర్ ముళ్ళపాటి విజయ సీతారాములు పాల్గొని మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచే బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.బతుకమ్మ పాటలు, పండుగ సందడితో వార్డులో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో వార్డుకు చెందిన మహిళలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది