ప్రజాపక్షం/ఖమ్మం: ప్రజాపక్షం దినపత్రిక ఎనిమిదో వార్షికోత్సవ వేడుకలను గురువారం ఖమ్మం నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయం గిరిప్రసాద్ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ప్రజాపక్షం ఖమ్మం ఉమ్మడి జిల్లా బ్యూరో ఏనుగు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, పత్రిక ఎనిమిదో వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏనుగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ప్రజాపక్షం దినపత్రిక పనిచేస్తోందన్నారు. పత్రిక ఎనిమిదో వసంతంలోకి అడుగుపెట్టడం ప్రజాపక్షం కుటుంబ సభ్యులకు సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. ప్రజల ఆదరాభిమానాలను పొందుతూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ విలేకరులు మరింత బాధ్యతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడ్వర్టైజ్‌మెంట్ మేనేజర్ ప్రసన్న, భద్రాద్రి కొత్తగూడెం ప్రజాపక్షం ఇన్‌చార్జి సత్యానంద్, ఆర్సీ ఇన్‌చార్జులు ప్రసాద్, పులి కృష్ణార్జున, శ్రీకాంత్, అశోక్‌తో పాటు ఉమ్మడి జిల్లా మండల రిపోర్టర్లు పాల్గొన్నారు.
ఘనంగా 'ప్రజాపక్షం' దినపత్రిక 8వ వార్షికోత్సవ వేడుకలు
byThe News Desk
-
0


إرسال تعليق