అర్హులైన ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇళ్ల మంజూరు
గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు పాకనాటి కన్నారెడ్డి
ప్రజాపక్షం /నేలకొండపల్లి: పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పాకనాటి కన్నారెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇళ్లు మంజూరు చేస్తూ పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. గురువారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారురాలు కర్ల పూజారాణి ఇంటి నిర్మాణానికి పాకనాటి కన్నారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుంబూరు దయాకర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో అర్హులైన లబ్ధిదారులకు దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతున్నాయని తెలిపారు. ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెంటమల్ల పుల్లమ్మ, పంచాయతీ కార్యదర్శి మహేష్, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు తిగుళ్ల భాస్కర్, గ్రామ కాంగ్రెస్ నాయకులు తిగుళ్ల భవాని, మేకల అర్జున్, చెరుకుపల్లి రాజేష్, చెరుకుపల్లి ఉపేందర్, వడ్లమూడి నరసయ్య, వడ్లమూడి వెంకటేశ్వర్లు, కర్ల అశోక్, కుమ్మరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి