ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: మండలంలోని పొన్నెకల్లు గ్రామానికి చెందిన నెమలిపురి లక్ష్మయ్య (70) గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమయ్యారు. ఇంటి నుంచి వెళ్లిన ఆయన సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. లక్ష్మయ్య కోసం కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తులతో పాటు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలించినప్పటికీ ఆయన ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. లక్ష్మయ్య ఆచూకీ తెలిసిన వారు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం తెలిసిన వారు 9948828655, 8897092428 నంబర్లను సంప్రదించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన వృద్ధుడు.. ఆచూకీ కోసం విస్తృత గాలింపు
byThe News Desk
-
0

కామెంట్‌ను పోస్ట్ చేయండి