శాలువతో సత్కరించిన పార్టీ నాయకులు
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం ఎం. వెంకటాయపాలెం మాజీ సర్పంచ్ తుమ్మల సురేష్ గురువారం కాంగ్రెస్ నాయకులను ఆత్మీయంగా కలిశారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో పార్టీ శ్రేణులతో ఆయన ఆత్మీయంగా మమేకమయ్యారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు తుమ్మల సురేష్‌ను సాలువతో సత్కరించి అభినందించారు. పార్టీ కార్యక్రమాలు, గ్రామంలో ప్రజా సమస్యలు తదితర అంశాలపై నాయకుల మధ్య చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మద్దెల నాగయ్య, గంగవరపు రత్నాకర్, పాపిట్ల శ్రీను, సత్యం, వెంకటనారాయణ, మధు, రాయుడు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి