ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

అష్టాచమ్మా.. వేలల్లో బెట్టింగ్!నలుగురి అరెస్ట్


ప్రజాపక్షం/నేలకొండపల్లి: సరదాగా ఆడుకునే ‘అష్టాచమ్మా’ ఆటను జూదంగా మార్చి డబ్బులు పందెంగా పెడుతున్న వ్యవహారాన్ని నేలకొండపల్లి పోలీసులు బట్టబయలు చేశారు. విశ్వసనీయ సమాచారంతో గురువారం దాడులు నిర్వహించిన పోలీసులు, నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.5,000 నగదు, 3 సెల్‌ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. మండల పరిధిలోని అప్పలనరసాపురం గ్రామంలో గల వెటర్నరీ ఆసుపత్రి సమీపంలో ఆరుగురు వ్యక్తులు చేరి అష్టాచమ్మా ఆటపై పందాలు కాస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. పోలీసులను గమనించి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే పరారవ్వగా, మిగతా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారి వద్ద నుంచి పందెం సొమ్ము రూ.5,000తో పాటు మూడు మొబైల్ ఫోన్లు, ఒక కారును సీజ్ చేశారు. ఈ ఘటనలో పట్టుబడిన నలుగురితో పాటు పరారైన మరో ఇద్దరిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పి. శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. "అష్టాచమ్మా, కోళ్ల పందాలు, పేకాట లేదా ఆన్‌లైన్ బెట్టింగ్‌లు.. రూపం ఏదైనా సరే జూదం ఆడినా, నిర్వహించినా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు" అని హెచ్చరించారు. ముఖ్యంగా యువత ఇటువంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది