ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

గుర్రపు డెక్క తొలగింపునకు కౌన్సిలర్ దండి రంగారావు చొరవ


 

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో గల ఎదులాపురం చెరువు అలుగు కాల్వలో పేరుకుపోయిన గుర్రపు డెక్కను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శనివారం తొలగించారు. వార్డులో నీటి ప్రవాహానికి ఇబ్బందులు తలెత్తకుండా గుర్రపు డెక్క తొలగింపు పనులను సీపీఐ కౌన్సిలర్ దండి రంగారావు ప్రారంభించి, పనులను స్వయంగా పరిశీలించారు. చెరువు కాల్వలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలు, గుర్రపు డెక్కను తొలగించి నీటి ప్రవాహం సజావుగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కౌన్సిలర్ తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది