ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సింహాద్రినగర్‌కు చెందిన దారం సుప్రజ మృతి చెందారు. సుప్రజ మరిపెడకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న అనంతరం అమెరికాలో నివసిస్తున్నారు. అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో రెస్టారెంట్ నిర్వహిస్తున్న సుప్రజ.. రాత్రి రెస్టారెంట్ మూసివేసిన అనంతరం స్నేహితురాలితో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. కొద్దిసేపటికే వారు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుప్రజ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమెతో ఉన్న స్నేహితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. సుప్రజకు భర్త, కుమారుడు ఉన్నారు. ఆమె మృతితో సింహాద్రినగర్‌లోని కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఖమ్మం యువతి మృతి
byThe News Desk
-
0

కామెంట్‌ను పోస్ట్ చేయండి