ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

హామీలకే పరిమితమైన జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీ!



 

సొంతింటి కల ఎప్పటికి నెరవేరేను..?

గాంధీ విగ్రహం ఎదుట జర్నలిస్టుల నిరసన.. ఇళ్ల స్థలాలు, హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్‌

ప్రజాపక్షం /నేలకొండపల్లి: ప్రజా సమస్యలపై నిత్యం కలంతో పోరాడుతూ.. పాలకుల దృష్టికి ప్రజల కష్టాలను తీసుకెళ్తున్న జర్నలిస్టుల సొంతింటి కల మాత్రం ఏళ్ల తరబడి హామీలకే పరిమితమవుతోంది. ప్రభుత్వాలు మారుతున్నా.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్న హామీలు అమలుకు నోచుకోవడం లేదని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం నేలకొండపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టియుడబ్ల్యూజె (ఐజేయూ) జిల్లా ఉపాధ్యక్షులు పోలంపల్లి నాగేశ్వరరావు మాట్లాడారు.... సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ప్రజా సమస్యలను నిరంతరం వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టుల జీవితాల్లో మాత్రం అనేక సమస్యలు నెలకొన్నాయని అన్నారు. వృత్తిపరంగా ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ప్రజల కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు కనీస వసతులైన సొంత ఇళ్లు కూడా లేకపోవడం విచారకరమన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలతో పాటు ప్రస్తుత ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సంక్షేమంపై దృష్టి సారించి, ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలం కేటాయించడంతో పాటు హెల్త్‌ కార్డులు అందించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను జర్నలిస్టులకు వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే జర్నలిస్టులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో టియుడబ్ల్యూజె జిల్లా కమిటీ సభ్యులు పెంటమళ్ల కోటయ్య, సీనియర్ జర్నలిస్టు అత్తులూరి హనుమంతరావు, నాయకులు రేగూరి శ్రావణ్‌కుమార్‌, వడ్లమూడి వెంకటేశ్వర్లు, మల్లేబోయిన ఉపేందర్‌, తుమ్మ ఉపేందర్‌, దుడ్డెల సంజయ్‌కుమార్‌, నంద్యాల శివాజీ, పంబా రవి, పి.సూర్య, పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది