ప్రజాపక్షం/మణుగూరు: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన మణుగూరులో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ముత్యాలమ్మ నగర్‌కు చెందిన బోధన గడ్డ వెంకటేశ్వర్లు (65) ఐతేనకుంట చెరువులో చేపల వేటకు వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే మృతి చెందినట్లు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చేపల వేటకు వెళ్లి చెరువులో పడి వ్యక్తి మృతి
byThe News Desk
-
0

కామెంట్‌ను పోస్ట్ చేయండి