ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

విద్యావంతుడైన యువకుడికి కాంగ్రెస్‌లో కీలక బాధ్యత



ఏదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ యువజన అధ్యక్షుడిగా గుర్రం రాకేష్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక


ప్రజాపక్షం/ఖమ్మంరూరల్ : విద్యావంతులైన యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పిస్తూ, పార్టీ బలోపేతంలో భాగస్వాములను చేయాలనే కాంగ్రెస్ పార్టీ ఆలోచనకు నిదర్శనంగా ఇప్పటికే అనేక అడుగులు వేసింది. అందుకు తగ్గట్టుగానే తాజాగా ఎన్నికైన ఓ యువకుడి నియామకం నిలుస్తుందటంలో ఎటువంటి సందేహం లేదు. 



ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డులోని జీవీఆర్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం 32 వార్డుల కాంగ్రెస్ కమిటీల నియామక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోతు కిషోర్ ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డుకు చెందిన ఎంఏ, బీఈడీ విద్యార్హతలు కలిగిన గుర్రం రాకేష్ రెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ యువజన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నియామకాన్ని ప్రకటించారు. 


యువతను సంఘటితం చేయడమే లక్ష్యం


ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గుర్రం రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతను అప్పగించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. యువతను సంఘటితం చేస్తూ, వారి భాగస్వామ్యంతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తంబూరు దయాకర్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి నియామకం పట్ల కాంగ్రెస్ శ్రేణులు, శ్రేయోభిలాషులు, మిత్రులు అభినందనలు తెలిపారు. విద్యార్హతలతో పాటు యువతలో చురుకైన పాత్ర పోషించే అవకాశం కల్పించే ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని రాకేష్ రెడ్డికి పలువురు ఆకాంక్షించారు.


ఉన్నత విద్యార్హతలు కలిగిన యువకుడికి పార్టీ బాధ్యతలు అప్పగించడం ద్వారా యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించాలనే పార్టీ లక్ష్యం మరోసారి స్పష్టమైంది.
 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది