రైతులు, గ్రామస్తులు, వలస పక్షులకు మేలు చేకూర్చేలా చెరువుల నింపకం: తోట వీరభద్రం
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు, మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబురి దయాకర్ రెడ్డి సూచనల మేరకు పాలేరు రిజర్వాయర్ నుంచి చింతపల్లి చెరువుకు సోమవారం నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఖమ్మం రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట వీరభద్రం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి చింతపల్లి చెరువును పరిశీలించారు. చెరువుల్లో నీటిని నింపడం ద్వారా గ్రామస్తులకు, రైతులకు తాగునీరు, వ్యవసాయ అవసరాలకు ఇబ్బందులు లేకుండా చేయడంతో పాటు, చెరువులను ఆశ్రయించే సైబీరియన్ కొంగలు వంటి వలస పక్షులకు కూడా ప్రయోజనం చేకూరుతుందని తోట వీరభద్రం పేర్కొన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని చెరువులను నింపుతూ ప్రజలు, రైతులు, పక్షుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకుంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి మాజీ సర్పంచ్ ముత్యం చిన్న కృష్ణారావు, తోట రామకృష్ణ, గునిగంటి రమేష్, గునిగంటి సురేష్, ఇరిగేషన్ లస్కర్ బాబు, కోడె ప్రవీణ్, పీఎస్ఆర్ సోషల్ మీడియా వారియర్ ఆరేంపుల బద్రిసాయి తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి