ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

జనసందోహం నడుమ దసరా వైభవం.. ఇల్లెందు వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి



 


ప్రజాపక్షం/ఇల్లెందు: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇల్లెందులో మంగళవారం అర్ధరాత్రి వరకు నిర్వహించిన దసరా వేడుకలు వైభవంగా సాగాయి. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి ఉత్సవాల్లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ఇల్లెందులో దసరా వేడుకలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తూ వేలాదిమంది పాల్గొనడం అభినందనీయమని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాల్లో భాగస్వాములు కావడం పండుగ ప్రత్యేకతను చాటుతోందన్నారు. కళాకారుల ఆటపాటలు, ప్రదర్శనలు, వారి ఉత్సాహం చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తోందని కొనియాడారు.


ధర్మానికి విజయదశమి ప్రతీక




చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి విజయదశమి ప్రతీకగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ పర్వదినం సత్యం, ధర్మం పట్ల నిబద్ధతతో ముందుకు సాగాలనే సందేశాన్ని అందిస్తుందన్నారు. పండుగలు మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడటంతోపాటు ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ వేడుకల్లో స్థానిక నాయకులు, ఉత్సవ నిర్వాహకులు, కళాకారులు, పట్టణ ప్రజలు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది