ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి


 


కలెక్టరేట్ మహా ధర్నాలో ఏదులాపురం మున్సిపాలిటీ సీపీఐ నాయకులు


ప్రజాపక్షం/ఖమ్మం( కలెక్టరేట్): రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కమిటీలను రద్దు చేసి, ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, టీఆర్ఎస్ కలిసి గురువారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహించాయి. ఈ మహా ధర్నాకు ఏదులాపురం మున్సిపాలిటీ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో 28వ వార్డు సీపీఐ కౌన్సిలర్ దండి రంగారావు నాయకత్వంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లాయి. ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇళ్ల కేటాయింపులో అర్హులైన పేదలకు న్యాయం జరగాలని, ఇందిరమ్మ ఇళ్ల కమిటీలను రద్దు చేసి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని నినాదాలు చేశారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్న నాయకులు డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందే వరకు తమ డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని వారు పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది