ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

డి టి ఓ పై మంత్రి పొంగులేటి ఆగ్రహం?


 

 



ప్రజాపక్షం వరుస కథనాలతో కదలిక


కార్యాలయ వ్యవహారాలపై కాంట్రాక్టర్ల ఫిర్యాదు.. అధికారులతో అత్యవసర సమావేశం!


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం జిల్లా ఆర్టీఓ కార్యాలయంలో కొనసాగుతున్న అవినీతి వ్యవహారాలపై ప్రజాపక్షం వరుస కథనాలు ప్రచురిస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికార యంత్రాంగంలో కదలిక మొదలైనట్లు సమాచారం. కార్యాలయ వ్యవహారాలపై కాంట్రాక్టర్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి ఫిర్యాదులు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో మంత్రి సంబంధిత డీటీఓపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే మూడు రోజులుగా ప్రచురితమవుతున్న కథనాలు, తాజాగా వెలుగులోకి వచ్చిన పరిణామాలతో ఆర్టీఓ కార్యాలయ వ్యవహారాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం అధికారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


మంత్రి స్పందనతో అధికారుల్లో కదలిక?


కాంట్రాక్టర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులపై మంత్రి పొంగులేటి సీరియస్‌గా స్పందించి సంబంధిత డీటీఓను పిలిపించి మందలించినట్లు సమాచారం. అనంతరం డీటీవో బుధవారం సాయంత్రం కార్యాలయంలో అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. తమ పరిధిలోని వ్యవహారాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఆరోపణలకు తావులేకుండా విధులు నిర్వహించాలని సూచించినట్లు సమాచారం. అలాగే మామూళ్ల వసూళ్లకు సంబంధించిన పనులను పక్కన పెట్టాలని ఆదేశించినట్లుగా క్షేత్రస్థాయి నుంచి వినికిడి.


వరుస కథనాల నేపథ్యంలో ప్రాధాన్యం


ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రజాపక్షం ప్రచురిస్తున్న వరుస కథనాల నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్టీఓ కార్యాలయంలో జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారాలపై కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేయడం, మంత్రి స్థాయిలో స్పందన వచ్చినట్లు సమాచారం వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.అయితే, ఈ ఆరోపణలకు సంబంధించి ఉన్నత స్థాయి అధికారులు కూడా కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలపై దృష్టి సారించాలని పలువురు పేర్కొంటున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది