ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

విద్యుత్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి


 


రైతులు, ప్రజలకు విద్యుత్‌ శాఖ ఏఈ జి. రవి సూచన


ప్రజాపక్షం/నేలకొండపల్లి: ఆర్నాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలు విద్యుత్‌ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేలకొండపల్లి విద్యుత్‌ శాఖ ఏఈ జి. రవి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని విద్యుత్‌ శాఖ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ పొలాల్లో విద్యుత్‌ వైర్లు తెగిపడితే వాటిని తాకకుండా వెంటనే విద్యుత్‌ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. తడి చేతులతో మోటారు స్విచ్‌ బోర్డులను తాకరాదని, విద్యుత్‌ స్తంభాలు, సపోర్ట్‌ వైర్లకు పశువులను కట్టవద్దని సూచించారు. కాలం చెల్లిన, జాయింట్లు ఉన్న సర్వీస్‌ వైర్లను వెంటనే మార్చుకోవాలని తెలిపారు. విద్యుత్‌ తీగలపై చెట్ల కొమ్మలు పడినప్పుడు సిబ్బందికి తెలియజేయాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫ్యూజులు కాలిపోయినా, ఇతర సమస్యలు తలెత్తినా రైతులు స్వయంగా స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ఎక్కరాదని స్పష్టం చేశారు. ప్రమాదాలను నివారించేందుకు విద్యుత్‌ శాఖ సిబ్బందికి సమాచారం అందించి సహకరించాలని కోరారు. విద్యుత్‌ సమస్యలుంటే 87124 83652 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని ఏఈ రవి సూచించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది