ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి


 

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం), తెలంగాణ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామంలో సీపీఐ(ఎం), తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల నాయకులు పొన్నం వెంకటరమణ మాట్లాడుతూ.. జిల్లాలో ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు కోతలు లేని నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులు తీసుకున్న పంట రుణాలపై వడ్డీని మాఫీ చేయడంతో పాటు, ఇంకా మిగిలి ఉన్న రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి కరువు నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పొన్నం మురళి, పొన్నం భాస్కర్‌రావు, యల్ది పరుశరామ్, రైతు సంఘం నాయకులు వట్టేకోటి వెంకన్న, మాసారపు ఉపేందర్‌రావు, వట్టేకోటి మల్లయ్య, యల్ది వాసు, అద్దంకి ఉపేందర్‌రావు, మేడెబోయిన కిషోర్, అద్దంకి వెంకటేష్, యల్ది యాకయ్య, షేక్ నవాబ్ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم