ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

గంజాయికి బానిసై.. జల్సాల కోసం చోరీలు!


 


ఐదుగురు అరెస్ట్‌.. రిమాండ్‌కు తరలింపు


రెండు స్కూటీలు, బైక్‌, సెల్‌ఫోన్‌ స్వాధీనం.. మరొకరు పరార్‌

ప్రజాపక్షం/నేలకొండపల్లి: గంజాయి వ్యసనానికి బానిసై.. జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాలో ఐదుగురు నేలకొండపల్లి పోలీసులకు చిక్కారు. మరో నిందితుడు పరారయ్యాడు. నిందితుల నుంచి రెండు స్కూటీలు, ఒక మోటార్‌ సైకిల్‌, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేలకొండపల్లి ఎస్సై పి.శ్రీనివాసరెడ్డి మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. ముజ్జుగూడెం క్రాస్‌రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో రెండు స్కూటీలు, ఒక మోటార్‌ సైకిల్‌పై వెళ్తున్న ఆరుగురు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులంతా ఖమ్మం పట్టణానికి చెందిన వారని, గంజాయికి అలవాటుపడి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. గతంలోనూ వీరిపై చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల ఖమ్మంలో ఒక స్కూటీ, నేలకొండపల్లిలో ఒక మోటార్‌ సైకిల్‌, ఆంధ్రప్రదేశ్‌లోని ఎటపాక మండలంలో మరో స్కూటీని చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో బండారు గోపిచంద్‌, గద్దల మనోజ్‌కుమార్‌, తోట మహేష్‌, షేక్‌ గౌస్‌, నల్గొండ కార్తీక్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న దుగ్గిరాల హేమంత్‌పై కేసు నమోదు చేసి, అతడి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم