ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఎదులాపురం చెరువు ఆక్రమణలు తొలగించి.. మంచినీటి పథకాన్ని పునరుద్ధరించాలి


 

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సీపీఐ 28వ వార్డు కౌన్సిలర్ దండి రంగారావు వినతి


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎదులాపురం చెరువు ఆక్రమణలను తొలగించి, మున్సిపాలిటీతో పాటు ఖమ్మం రూరల్ మండల ప్రజల మంచినీటి అవసరాలను తీర్చే రక్షిత మంచినీటి పథకాన్ని పునరుద్ధరించాలని సీపీఐ 28వ వార్డు కౌన్సిలర్ దండి రంగారావు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరారు. ఆదివారం ఎదులాపురం మున్సిపాలిటీ పర్యటనకు వచ్చిన మంత్రికి ఆయన వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా దండి రంగారావు మాట్లాడుతూ సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎదులాపురం ఈదుల చెరువు ఆక్రమణలకు గురికావడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఫలితంగా మున్సిపాలిటీతో పాటు ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాల ప్రజల తాగునీటి అవసరాల కోసం సుమారు రూ.10 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకానికి అవసరమైన నీరు అందకపోవడంతో పథకం నిలిచిపోయిందని వివరించారు.చెరువు ఆక్రమణలను గుర్తించి తొలగించడంతో పాటు చెరువు నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చెరువును నీటితో నింపే అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. చెరువులో నీటి నిల్వలు పెరిగితే రక్షిత మంచినీటి పథకానికి నీరందించడంతో పాటు ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా సమస్యను ప్రాధాన్యంగా తీసుకొని పరిష్కరించాలని మంత్రి పొంగులేటిని కోరినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి, సమస్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తానని భరోసా ఇచ్చినట్లు దండి రంగారావు వెల్లడించారు.



إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم