ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

రక్తంతో చిత్రించి అభిమానం చాటుకున్న యువకుడు.. కందాలకు అందజేత


 

పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి రక్తంతో గీసిన చిత్రాన్ని అందించిన గౌతమ్


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: పాలేరు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కందాల ఉపేందర్ రెడ్డిపై ఓ యువకుడు తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తన రక్తంతో ఆయన చిత్రాన్ని గీసి ఆదివారం సాయి గణేష్ నగర్‌లో కందాల ఉపేందర్ రెడ్డిని కలిసి స్వయంగా అందజేశాడు. ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్దారుపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ యువ నాయకుడు గౌతమ్ ఈ చిత్రాన్ని రూపొందించి అందజేశారు. యువకుడు చూపిన అభిమానానికి కందాల ఉపేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభిమానం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. అయితే, నిండు ప్రాణాలను నిలబెట్టే విలువైన రక్తాన్ని ఓ నిండు ప్రాణాన్ని రక్షించేందుకు వెచ్చించాల్సిందిగా సూచించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది