ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

విద్యుత్‌ షాక్‌తో వలస కార్మికుడి మృతి


 


పాఠశాల నూతన భవన నిర్మాణ పనుల్లో విషాదం.. చికిత్స పొందుతూ మృతి


ప్రజాపక్షం /నేలకొండపల్లి: రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం.. పొట్టకూటి కోసం సొంత రాష్ట్రాన్ని విడిచి వచ్చి కూలీ పనులు చేసుకుంటున్న యువకుడిని విద్యుత్‌ రూపంలో మృత్యువు కబళించింది. నిర్మాణ పనుల్లో భాగంగా పైపులు, కిటికీలు అందిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురైన రాజస్థాన్‌కు చెందిన సునీల్‌ కుమార్‌ (19) చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషాద ఘటన నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామంలోని ఎస్‌ఎఫ్‌ఎస్‌ పాఠశాలలో నూతన భవన నిర్మాణ పనుల వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన సునీల్‌ కుమార్‌ కాంట్రాక్టర్‌ వద్ద కూలీ పనులు చేసేందుకు తెలంగాణకు వచ్చాడు. కోదాడలో నివాసం ఉంటూ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరులోని సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్ పాఠశాలలో నూతనంగా నిర్మిస్తున్న భవన పనులకు వెళ్లాడు. అక్కడ నిర్మాణ పనుల్లో భాగంగా కార్మికులకు పైపులు, కిటికీలు అందిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. దీంతో వెంటనే అతడిని నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేతికి అందివచ్చిన యువకుడు అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. మృతుడి సోదరుడు హనుమానరామ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేలకొండపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది