ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రాజేష్, మండల వ్యవసాయ అధికారి జె. ఉమా నాగేశ్, వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు), రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు నేల పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం, సమతుల్య ఎరువుల యాజమాన్యం, సహజ వ్యవసాయం, పంట అవశేషాల నిర్వహణ, నీటి సంరక్షణ, సమగ్ర సస్యరక్షణ, వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల ప్రణాళిక తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పంట అవశేషాలను కాల్చకుండా వాటిని సమర్థవంతంగా వినియోగించాలని, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, నీటిని పొదుపుగా వినియోగించాలని అధికారులు రైతులకు సూచించారు. ఈ పద్ధతులను పాటించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పంటల దిగుబడులను మెరుగుపరుచుకోవచ్చని వివరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని రైతులకు సూచించారు.
ముత్తగూడెంలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం
byThe News Desk
-
0


కామెంట్‌ను పోస్ట్ చేయండి