శిబిరాన్ని విజయవంతం చేయాలి: కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి
ప్రజా పక్షం/కూసుమంచి: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 28వ తేదీ బుధవారం కూసుమంచిలోని పాలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలిచి, అవసరమైన రక్తాన్ని అందించాలనే సంకల్పంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకొచ్చి రక్తదానం చేయాలని కోరారు. శిబిరాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువత, మంత్రి అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ వంతు సహకారం అందించాలని బజ్జూరి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి